Logo
Date of Publish : 09 January 2026, 4:35 pm
Editor : Sake Naresh

అట్టహాసంగా జరిగిన కే–రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు.

అట్టహాసంగా కె –రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు.

నరసరావుపేట,జనవరి 09.( జనస్వరం)

పట్టణంలోని కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భారతీయ సంప్రదాయాలు, పండుగల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల రంగోలి చిత్రాలు, పంటల ప్రతీకలు, పతంగులతో సుందరంగా అలంకరించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను చాటుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు , డైరెక్టర్ కోమటనేని నాసరయ్య, ప్రిన్సిపాల్ బర్నబాస్, క్యాంపస్ ఇన్చార్జ్ కోట బాపూజీతో పాటు ఉపాధ్యాయులు చిన్నారులపై సంప్రదాయ పద్ధతిలో భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. ఈ ఘట్టం పండుగ వాతావరణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

టీ

ఈ సందర్భంగా చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ “సంక్రాంతి వంటి పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేస్తాయి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఆనందం, ఐక్యత, కుటుంబ విలువలు పెంపొందుతాయి” అని తెలిపారు. డైరెక్టర్ కోమటనేని నాసరయ్య మాట్లాడుతూ, “విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వడమే కె-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లక్ష్యం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తాము” అని అన్నారు.ఈ సంక్రాంతి సంబరాల్లో బోధనా, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయవంతంగా నిర్వహించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com