
విజయవాడ, (జనస్వరం) : స్థానిక పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ జనసేన అధ్యక్షుడు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం రావడానికి వందేళ్ల క్రితమే వర్ణ, కుల, లింగ వివక్షపై గళమెత్తి పోరాడి ప్రజలను చైతన్యపరచిన దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. వెనుకబాటుకు మూలం సమాజంలో సగభాగమైన మహిళలు విద్యకు దూరమవడమే కారణమని భావించి స్త్రీలకు ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించారని, ఆయన జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మలపరెడ్డి అప్పారావు, పడాల రాంబాబు, బసవ సాయి, అకిర రమేష్, చలపాకుల సురేష్, పడాల రాంబాబు, చెట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.