హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా డా. జేవీఎస్ భాస్కర్‌కు 'ఇన్‌స్పిరేషన్ నేషనల్ అవార్డు – 2026.
హైదరాబాద్,జూలై12 ( జనస్వరం)
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యువత మార్గదర్శి, లీడర్‌షిప్ ట్రైనర్, సామాజిక వ్యాపారవేత్త, ఇన్‌స్పైర్ రే ఆఫ్ లైఫ్ వ్యవస్థాపకుడు & సీఈఓ డా. జేవీఎస్ భాస్కర్ కి, యువత సాధికారత, విద్య, నాయకత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం మరియు సామాజిక సేవ రంగాల్లో అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక "ఇన్‌స్పిరేషన్ నేషనల్ అవార్డు – 2026" ప్రదానం చేయబడింది. "యువత సాధికారత – సమాజ సేవ" అనే లక్ష్యంతో డా. జేవీఎస్ భాస్కర్ అనేక మంది విద్యార్థులు, యువత మరియు యువ నిపుణులకు నాయకత్వ నైపుణ్యాలు, జీవిత నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై శిక్షణ అందిస్తూ వారి జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువస్తున్నారు.ఆయన స్థాపించిన ఇన్‌స్పైర్ రే ఆఫ్ లైఫ్ సంస్థ ద్వారా యువ నాయకత్వాన్ని పెంపొందించడం, సామాజిక బాధ్యతను ప్రోత్సహించడం, అంతర్జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలను విస్తరించడం వంటి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.ఈ అవార్డును స్వీకరించిన సందర్భంగా డా. జేవీఎస్ భాస్కర్ మాట్లాడుతూ ఈ గౌరవాన్ని తన కుటుంబ సభ్యులు, గురువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు మరియు ఇన్‌స్పైర్ బృందానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ జాతీయ స్థాయి గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, యువత సాధికారత, సమాజ సేవ, నైతిక విలువలు కలిగిన ప్రపంచ స్థాయి నాయకులను తీర్చిదిద్దే తన ప్రయాణాన్ని మరింత అంకితభావంతో కొనసాగిస్తానని పేర్కొన్నారు.