అనంతపురం ( జనస్వరం ) : రాప్తాడు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు జూటూరు మధు పత్రికా ముఖంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న ఆర్ట్స్ కళాశాల మైదానం నందు మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుగనుందని తెలియజేశారు. స్వయంకృషితో సినిమా రంగంలోకి అడుగు పెట్టి అంచెలంచలుగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారి జీవితం ఎంతో మందికి స్పూర్తిదాయకమని అన్నారు. మొట్ట మొదటసారిగా మన అనంతపురంలో చిరంజీవి గారి ప్రీ రిలీజ్ సినిమా వేడుకను జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఆర్ట్స్ కళాశాల మైదానం నందు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. రాప్తాడు నియోజకవర్గ మెగా కుటుంబ అభిమానులు, జనసైనికులు, వీర మహిళలు ఈ కార్యక్రమమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రాయల్ నరేష్, సదా, ముస్తాఫా, పోతులయ్య, రామకృష్ణ, ఓబులేసు, రాజు, ఖాదర్, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com