విజయనగరం ( జనస్వరం ) : బాడంగి మండలం, వీరసాగరం గ్రామంలో చేపల చెరువులమీద బతికే గిరిజనలను, అదికార రాజకీయ నాయకులు, అధికారులు, మత్యకార సొసైటీ వారు కలసి అత్యంత దారుణంగా కలక్టర్ గారి ఆదేశాలను, ప్రభుత్వ జి.ఓ. లను పక్కన పెట్టి,ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఆ గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసి ఇబ్బందులు గురిచేస్తున్న గిరిజనులకు జనసేన పార్టీ అండగా నిలిచింది. వీరికి న్యాయం చేయాలని జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శాంతియతంగా నిర్వాసితులతో ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ వీరసాగరం గ్రామంలో గిరిజనులకు వైసిపి ప్రభుత్వం కల్పించిన గడువు మూడునెలలు గడిచినా సహకార సంఘం, అధికార పార్టీ నాయకులు, డబ్బులు కట్టించుకోకుండా గిరిజనులకు మానసికంగా, వ్యక్తిగత దూషణలతో ఆవమాన పరుస్తున్నారని ఇటువంటి గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతూ, కలక్టర్ కు వినతిని సమర్పించాలని, జిల్లా కలెక్టర్ అక్కడికక్కడే ఆర్.డి.ఓ. ను పిలిచి, వీరసాగారం గ్రామాన్ని సమస్యాత్మక గ్రామంగా గుర్తించి, గిరిజనులకు న్యాయం చేయాలని ఆదేశించారు. వెంటనే స్పందించిన కలక్టర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, త్వరలోనే గిరిజనులకు సహకార సంఘం ద్వారా డబ్బలు కట్టించుకొని, జీవనాధారమైన చేపలు చెరువులను అప్పజెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు త్యాడ రామకృష్ణారావు (బాలు) వీర సాగరం గ్రామస్థులు, దళిత, గిరిజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గన్నారు.