Logo
Date of Publish : 15 April 2023, 3:29 pm
Editor : Sake Naresh

చీమలపాడు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి : జనసేన నాయకులు

          ఖమ్మం ( జనస్వరం ) : నగరంలో గల ప్రెస్ క్లబ్ నందు జనసేన పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన ఖమ్మం అసెంబ్లీ కోఆర్డినేటర్ రామకృష్ణ మిరియాల మాట్లాడుతూ చీమలపాడులో జరిగిన సంఘటన తీవ్ర విషాదకరం,ఈ ఘటన పై ఖమ్మం జిల్లా జనసేన పార్టీ తరుపున సంతాపం వ్యక్తం చేస్తున్నాము.ఈ ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్న కారకులు ఎవరు అనేది ఎందుకు తేల్చలేదు? అసలు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?నిందితులను పట్టుకోవడంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అని ప్రశ్నించారు.ఈ ఘటన పై FIR నమోదు చేసారా,ఒక వేళా FIR నమోదు చేసినా ఎందుకు కేసు వివరాలు బయటకు చెప్పడం లేదు ?అంత గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఏముంది? ప్రభుత్వంలో వున్న బి ఆర్ ఎస్ పెద్దలే ఇందులో కుట్ర దాగివుంది అని చెప్తున్నారు అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడంలేదు.Mp/MLA స్థాయి వ్యక్తులు వచ్చే సభలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుతో పాటు సభ ప్రాంగణంలో.. ఫైర్ ఇంజన్, అంబులెన్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదు ?ఇది భద్రతా లోపం కాదా అని ప్రశ్నించారు. అసలు ఈ ఘటనపై ముందుగా Mp/mla పై కేసు నమోదు చేసి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.ఇంతటి ఘటనకు కారణంఐనా సభకు అసలు పర్మిషన్ వుందా,ఉంటె పర్మిషన్ కోసం ఇచ్చిన దరఖాస్తులో వున్న వ్యక్తుల పై ఎందుకు కేసు నమోదు చేయలేదు. అలాగే భాదిత కుటుంబాలకు 50లక్షలరూపాయలు ఎక్స్గ్రేషియా మరియు ప్రభుత్వ ఉద్యోగం,మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని ఈ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిహారాన్ని వెంటనే బాధితులకు అందజేయాలని కోరుతున్నాం లేని పక్షంలో భాదిత కుటుంబాలతో ప్రభుత్వంపై జనసేన పార్టీ తరుపున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం.అదే విధంగా జగన్మోహన్ మిరియాల మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉండి పోరాడతాం అని తెలిపారు.అదే విధంగా అశ్వారావుపేట కో ఆర్డినేటర్ డేగల రామచంద్రరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు మిరియాల జగన్ మోహన్, డేగల రామ చంద్ర రావు, మేడబోయిన కార్తీక్, యాసంనేని అజయ్ కృష్ణ, కట్టా రామకృష్ణ, పుల్లారావు, తాళ్లూరిడేవిడ్, ఖమ్మం నగర నాయకులు విజయకుమారి, దేవేందర్, స్రవంత్, శ్రీకాంత్, హరి, రాకేష్, వరప్రసాద్, నాగుల్ మీరా, సతీష్, నరసింహారావు, ఆథిక్, బాలకృష్ణ, నవీన్, నాగరాజు, మనోజ్, క్రాంతి  తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com