Logo
Date of Publish : 07 January 2021, 12:22 pm
Editor : Sake Naresh

దివ్యాంగులకు న్యాయం చేయాలి… నిరహారదీక్షకు జనసేన సంఘీభావం

                    అన్ని సక్రమంగా ఉన్న వారికి ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  వికలాంగులు విషయంలోనూ ఉదారంగా స్పందించి ఆదుకోవాలని జనసేన అధికార ప్రతినిధి శెట్టి రవి డిమాండ్ చేశారు. ఉండటానికి గూడు లేక ఎంతో కాలంగా నిరాశ్రయులుగా కాలం వెళ్లదీస్తున్న దివ్యాంగులు తమకు ప్రభుత్వం నివాస యోగ్యం కల్పించాలని రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. మండపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద వికలాంగులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని వారు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదన్నారు. వికలాంగుల విషయంలో నిబంధనలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ మానవత్వం తో స్పందించాలని కోరారు. ఇళ్లు లేక నిరాధారంతో బతుకుతున్న దివ్యాంగులను ప్రభుత్వం ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. అదేవిధంగా వారికి ప్రభుత్వం తరపున రావల్సిన సంక్షేమ ఫలాలు అన్నీ అందించి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పైడమళ్ళ సతీష్, మోటుపల్లి జానీ, నిమ్మ రమేష్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com