Logo
Date of Publish : 25 September 2021, 5:26 am
Editor : Sake Naresh

జనసేన పార్టీతోనే ముస్లింలకు న్యాయం : అనంతపురము జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్

             అనంతపురము, (జనస్వరం)  : జనసేన పార్టీ మైనార్టీల అభివృద్ధి సాధ్యమని జనసేన పార్టీ అధ్యక్షులు, అర్బన్ నియోజకవర్గ టి.సి వరుణ్ పేర్కొన్నారు. శుక్రవారం టి.సి వరుణ్‌ ఆధ్వర్యంలో 'ముస్లిం మైనార్టీ సోదరులు 150 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని, తెలుగుదేశం, వైసీపీ పార్టీ నాయకులు స్వలాభం కోసం ముస్లిం మైనార్టీ ఓటర్లును ఎన్నికలలో వినియోగించుకుని మైనార్టీ ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. ముస్లిం మైనార్టీలకు ఏ పథకాలు అందడంలేదని, మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా ముస్లిం సోదరీ సోదరీమణులకు అన్యాయం చేశారని వాపోయారు. ముస్లింలకు న్యాయం జరగాలంటే కులమతాలకు అతీతంగా పవన్‌ కళ్యాణ్‌ ఒక్కరే న్యాయం చేయగలరని ఆశతో ఈ రోజు జనసేన పార్టీలో చేరడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్‌, జిల్లా కమిటీ నాయకులు మాట్లాడుతూ, సామాన్యుల చేత కూడా రాజకీయం చేయగలిగిన సత్తా ఉన్న పార్టీ జనసేన పార్టీ అని,  ధరాజ్‌ భాష అనే ఒక ఆటో డ్రైవర్‌గా వృత్తి సాగిస్తున్న ఒక సామాన్య కార్యకర్తగా పార్టీలోకి చేర్చుకుని ఒక కార్చొరేటర్‌ ఎన్నికలలో పోటీ చేయించి తన కంటూ ఒక నాయకుడిగా ముద్రవేసి ఈరోజు జనసేన పార్టీలోకి అతని ద్వారా 150 మంది ముస్లిం సోదర సోదరీమణులను పార్టీలో చేర్చించారన్నారు. అతన్ని ఒక నాయకునిగా తీర్చిదిద్ది పార్టీలో సముచిత స్థానం ఇస్తూ ఒక ముస్లిం మైనార్టీ నాయకులు గుర్తించగలిగే అవకాశం ఈరోజు జనసేన పార్టీ కల్పించిందన్నారు. రబ్బర్ చెప్పులు వేసుకుని సామాన్య ప్రజల చేత రాజకీయం చేయిస్తానని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ మాటలకు ఇదే నిదర్శనమన్నారు. అలాగే జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌ చేసిన ఘనత ఒక్క పవన్‌ కళ్యాణ్‌కే సొంతమని, మొన్న జరిగినటువంటి జెడ్పీటీసి ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున నిలబడినటువంటి అభ్యర్థులు అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన కార్యకర్తలేనన్నారు. ఎన్నికల బరిలో నిలిచి అటు తెలుగుదేశం ఇటు వైయస్సార్‌ పార్టీ నాయకుల ఒత్తిళ్లకు దీటుగా సమాధానం ఇస్తూ ఓటింగ్‌ శాతంలో తనకంటూ ఓ ముద్ర వేసుకొని కొన్ని చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు గెలవడం  జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ కార్యదర్శి భవానీ రవికుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్ది, అంకే ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్‌, నాగేంద్ర, అబ్దుల్, రాప్తాడు ఇంఛార్జ్ సాకే పవన్‌ కుమార్‌, జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షులు మురళీకృష్ణ కార్యదర్శిలు సిద్దూ, రాపా ధనంజయ, సంజీవ రాయుడు, ఇండ్ల కీరణ్‌ కుమార్‌, జయమ్మ మహిళా నాయకురాలు పద్మావతి, సంయుక్త కార్యదర్శులు  విజయ్‌ కుమార్‌ మహిళా నాయకురాలు రూప, సావిత్రి, జనసేన నాయకులు పొదిలి బాబురావు, దివాకర్‌ గ్రంధి, జక్కిరెడ్డిఆదినారాయణ,  రోళ్ల భాస్కర్‌, విశ్వనాధ్‌, శ్రీనివాస్‌, హుస్సేన్‌, అంజి, ఆకుల ప్రసాద్‌, కేఎల్‌ఎస్‌ చోటు, సంతోష్‌ మురళి, సంపత్‌, అజయ్‌, పవన్‌ గౌడ్‌, మల్లి, విజయ్‌, రియాజ్‌, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com