విజయనగరం ( జనస్వరం ) : వైకాపా ప్రజాప్రతినిధులకు రోడ్ల దుస్థితి కనిపించకపోవడం సిగ్గుచేటని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని నిలదీశారు. ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ..?’ పేరిట తలపెట్టిన కార్యక్రమంలో రెండు రోజు ఎస్.బి.టి. మార్కెట్ జంక్షన్ , కంటోన్మెంట్ పోస్టాఫీస్ జంక్షన్ , అయ్యన్నపేట జంక్షన్ రోడ్లపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ విజయనగరం నియోజకవర్గంలో చాలా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. గుంతల రోడ్లపై ప్రయాణించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం కూటమి గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రోడ్లు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత మురళీ శంకర్రావు, జనసేన నేతలు కాటం అశ్విని,పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, టి.రామకృష్ణ, ఏంటి రాజేష్, ఎల్ .రవితేజ, అభిలాష్ , అడబాల వేంకటేష్, ఎమ్ .పవన్ కుమార్, పృథ్వీ భార్గవ్, కె.సాయి, కంది సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com