అనంతపురం ( జనస్వరం ) : వైసీపీ ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించలేక బి.సి బాలురు నరకయాతన అనుభవిస్తున్నారని జనసేన నాయకులు అన్నారు. వారు మాట్లాడుతూ అరాకొరఆ అల్పాహారం అందించడం వలన విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారని అన్నారు. కనీసం దుప్పట్లు, దోమతెరలు, బట్టలు పెట్టుకోవడానికి ట్రంకు పెట్టెలు, స్నానాల గదులకు డోర్లు లాంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేని దీనస్థితిలో గత నాలుగున్నర సంవత్సరాలుగా YCP ప్రభుత్వ పాలన సాగుతోందని అన్నారు. వైసీపీ బి.సి నాయకుల్లారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇలాంటి అరాకోర సౌకర్యాలు ఉన్న వసతగృహాల్లో మీ పిల్లల్ని చదివించడానికి మీరు ఇష్టపడతారా? సామాజిక సాధికారిక సభలు పెట్టి BC లను, SC, ST లను మాయ మాటలు, కల్లబొల్లి మాటలు చెప్పి ఇంకా ఎన్నాళ్లు కళ్ళు కప్పి మోసం చేస్తారు. మేము బి.సి లను ఉద్ధరించేసాం? అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వసతిగృహాల్లో సరైన సౌకర్యాలు లేక పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరచి చిత్తశుద్ధితో సంక్షేమ వసతి గృహాల్లో సరైన సదుపాయాలు కల్పించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతీయ మహిళ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు కుంటిమద్ది జయరామి రెడ్డి, అంకె ఈశ్వరయ్య, నగర అధ్యక్షులు బాబు రావు, ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, కార్యదర్శులు రాపా ధనుంజయ్, సంజీవ రాయుడు, కిరణ్ కుమార్, సిద్ధు, అవుకు విజయకుమార్, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, చక్రపాణి, హుస్సేన్, దరాజ్ భాష, కార్యదర్శిలు, లాల్ స్వామి, కుమ్మర మురళి, అంజి, సంపత్, వెంకటరమణ, ఆకుల అశోక్, వీరమహిళలు అనసూయ, దాసరి సరిత, శ్రీమతి వర్షిత, అంజలి, అరుణ, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్, నాయకులు ఎస్.నజీర్, చిరు, హీద్ధూ, నజీమ్, విజయ దేవ రాయల్, మల్లేష్, వినయ్, హరికృష్ణ, హరి ప్రసాద్, వంశీ, నౌషాద్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com