గుంటూరు ( జనస్వరం ) : అక్షరమే ఆయుధంగా అంటరానితనంపై, కులవివక్షపై పోరాడిన గొప్ప యోధుడు విశ్వకవి గుఱ్ఱం జాషువా అని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. ఆధునిక కవులలో అగ్రస్థానం పొందిన గుఱ్ఱం జాషువా జయంతి సందర్భంగా గురువారం నగరంపాలెంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ తన చిన్నతనం నుంచి అగ్రకుల అహంకారాలను, సంఘ సంఘర్షణలను గుఱ్ఱం జాషువా ఎదురుకున్నారన్నారు. గుండెల్ని తాకే భావ కవితలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, ఛీత్కారాలు ఎదురుకున్న చోటే సత్కారాలు పొందిన మహోన్నత వ్యక్తి గుఱ్ఱం జాషువా అని నేరేళ్ళ సురేష్ అన్నారు. గబ్బిలం, ఫిరదౌసి, కొత్తలోకం, తాజ్ మహల్ వంటి మహోన్నతమైన గ్రంధాలతో తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందిన విశ్వనరుడు గుఱ్ఱం జాషువా అని జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి కొనియాడారు. గుఱ్ఱం జాషువా అందించిన కవితా స్పూర్తితో సమాజంలో అసమానతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో నగర కమిటీ కార్యదర్శి బండారు రవీంద్ర , రెల్లి యువ నేత సోమి ఉదయ్, 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, బాలాజీ, రేవంత్, వహీద్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com