Logo
Date of Publish : 29 November 2021, 7:38 am
Editor : Sake Naresh

తెలంగాణ రైల్వే ఉద్యోగులు చేపట్టిన మహా నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన నాయకులు

•ఈ దేశానికి రైతులు, సైనికులు, ఎంత ముఖ్యమో రైల్వే కార్మికులు అంతే ముఖ్యం.

•రైల్వే కార్మికులు రోడ్డు ఎక్కి దీక్షలు ధర్నాలు చేయడం బాధాకరం.

•రైల్వే కార్మికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తు ప్రజలకు సురక్షితమైన సేవలు అందిస్తున్నారు.

•ఈ దేశానికి అధిక ఆర్ధిక లాభాలు రైల్వే సంస్థ నుంచే వస్తున్నాయి.

•రైల్వే కార్మికుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది.

•మహా నిరాహార దీక్షలో గ్రేటర్ వరంగల్ జనసేన పార్టీ అధ్యక్షులు  బైరి వంశీ కృష్ణ   

     కాజీపేట, (జనస్వరం) : జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ శ్రీ ఆకుల సుమన్ గారి సూచనలకు అనుగుణంగా గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ రైల్వే జేఏసీ తలపెట్టిన 30గంటల దీక్షకు సంపూర్ణ మద్దత్తు తెలపడం జరిగింది. ఈ మేరకు బైరి వంశీ కృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు తెలంగాణాను అణిచివేతకి గురిచేసారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగం ఆయన కాజీపేట జంక్షన్ కి అన్ని హంగులు అర్హతలు ఉన్న గత 40సంవత్సరాల పైగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని అధే విధంగా కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని, దశాబ్ద కాలంగా తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న కార్యరూపం దాల్చలేదు. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రజాప్రతినిధులు మౌనం, చట్టసభలలో కాజీపేట సమస్యలను లేవనెత్తకపోవడం, చర్చలు జరపకపోవడం వలన కాజీపేటకు తీరనిలోటు జరిగింది. ఇప్పుడు కొత్తగా తలెత్తిన మరో సమస్య రైల్వే కార్మికుల "లోకో పైలేట్స్ & అసిస్టెంట్ లోకో పైలేట్స్, గార్డులకు సంబందించిన ఎక్స్ ప్రెస్ రైళ్ళ క్రూ లింక్లను కాజిపేట్ నుంచి విజయవాడ తరలించడం జరిగింది. విజయవాడకు తరలించిన క్రూ లింక్ల ఎక్స్ ప్రెస్ ట్రైన్లను వెంటనే కాజిపేట్ క్రూ డిపోకు తరలించి రైల్వే జేఏసీ నాయకుల డిమాండ్లను నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శేషాద్రి సందీప్, మహమ్మద్ ఇబ్రహీం, కొండ్రా సాయి ప్రతాప్, మెడిద ప్రశాంత్, లైదేల్లా రాకేష్, సంతోష్, నవీన్, అన్వేష్, ఉమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com