పాలకొండ ( జనస్వరం ) : పాలకొండలో ఉన్న అయ్యప్ప శంకర్ పంక్షన్ హాల్ లో ఇరు పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడి మానిఫెస్టోని ప్రజలకు చేరువ అయ్యేలా ఉమ్మడి కార్యక్రమం, వైసిపి ప్రభుత్వం యొక్క అవినీతి కార్యకలాపాలు పైన ఉమ్మడి పోరాటం, 2024 లో జనసేన - టిడిపి ఉమ్మడి ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తాం అని ఇరు పార్టీల నేతలు నిర్ణయించటం మొదలగు విషయాలు చర్చించటం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన నేత, మాజీ ZPTC పాలకొండ జనసేన పార్టీ సమన్వయకర్త నిమ్మల నిబ్రమ్, పాలకొండ నియోజకవర్గం టిడిపి పార్టీ ఇంచార్జీ నిమ్మక జయక్రిష్ణ, జనసేన పార్టీ పరిశీలకులుగా ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ హాజరయ్యారు.. ఇరు పార్టీల ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గున్ని విజయవంతం చేయటం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com