పాడేరు, ఏప్రిల్ 12 (జనస్వరం) : బుధవారం పాడేరులో జరిగిన ఎన్డీయే కూటమి ఉమ్మడి ఆత్మీయ సమావేశంలో జనసేనపార్టీ పాడేరు ఇన్చార్జ్ డా..గంగులయ్య మాట్లాడుతూ జనసేనపార్టీ నాయకులుగా మా అధినేత నిర్ణయమే మా నిర్ణయమని ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. ఈ సందర్బంగా జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోసం మాట్లాడుతూ తనను తాను తగ్గించుకుని ప్రజల మనుసు గెలుచుకున్న జన నేత పవన్ కళ్యాణ్ ని మేము కచ్చితంగా ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి బహుమానంగా ఇస్తామన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ ఎన్నో ప్రలోభాలకు గురిచేస్తుందని దానిని నమ్మి వైసీపీ నాయకులు వలే గిరిజన ద్రోహానికి పాల్పడవద్దని ఈ సందర్బంగా గిరిజన ప్రజలకు హితవు పలికారు. అనేక అంశాల్లో గిరిజన జాతికి తీవ్రమైన ద్రోహం చేసిన వైసీపీ ప్రభుత్వం ఇంకోసారి మోసం చెయ్యడానికి సిద్ధమవుతోంది. ఈ కపట కుట్రలు, కుతంత్రాలు గిరిజన ప్రజలు నమ్మితే మరో 50ఏళ్ళు గిరిజన ప్రాంతం తిరోగమన దశకు చేరుకుంటుందన్నారు. ఎన్ని ఏమైనా మేమంతా కలిసి కట్టుగా ఈ ఎన్నికల్లో ఎన్డీయే ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత, అసెంబ్లీ అభ్యర్థి కిల్లు వెంకట రమేష్ నాయుడు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్బంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జనసేనపార్టీ నాయకులు, కిట్లంగి పద్మ జిల్లా ఉపాధ్యాక్షురాలు, అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత, జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారామ్, మసాడి భీమన్న, నందోలి మురళి కృష్ణ,కొయ్యం బాలరాజు, గూడెం లక్ష్మణ్ రావు, గౌరవ అధ్యక్షులు తెరవాడ వెంకటరమణ, చిన్ని రాజుబాబు, సాలేబు అశోక్, అధిక సంఖ్యలో జనసైనికులు హాజరయ్యారు.