Logo
Date of Publish : 18 November 2023, 8:04 pm
Editor : Sake Naresh

రోడ్ల దుస్థితిపై జనసేన – టిడిపిల ఉమ్మడి నిరసన

     ఆముదాలవలస ( జనస్వరం ) :  నియోజకవర్గంలో శ్రీకాకుళం ఆముదాలవలస ప్రధాన రహదారి పై చింతాడ వద్ద జనసేన తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా "గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది" పేరుతో, పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ గారు జనసేన పార్టీ ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు గారు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, ఆముదాలవలసలో రహదారులు మృత్యద్వారాలను తలపిస్తున్నాయని, నిత్యం వేలాదిగా రాకపోకలు సాగించే ఆముదలవలస శ్రీకాకుళం ప్రధాన రహదారి గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు కాబడిన నేటికీ పనులు జరగకపోవడం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. స్థానికంగా సభాపతి సీతారాం సొంత నియోజకవర్గంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సాధించేందుకు తెలుగుదేశం జనసేన పార్టీలో సంయుక్తంగా పోరాడి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. అనంతరం కూన రవికుమార్ గారు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఎన్నికలకు సిద్ధమవడం అభినందనీయమని తెలిపారు. అలాగే ఆముదాలవలస నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలపై రానున్న రోజుల్లో జనసేన తో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు పాత్రుని పాపారావు, మండల అధ్యక్షులు కొత్తకోట నాగేంద్ర, పైడి మురళీమోహన్, ఎలకల రమణ, ఎంపీటీసీ అంపిలి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com