
నల్గొండ, (జనస్వరం) : జనసేన పార్టీని ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలోపేతం చేసే దిశగా నల్గొండలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఉమ్మడి నల్గొండ ఇంఛార్జ్ శ్రీ మేకల సతీష్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు రెండు కళ్లువంటివని, రెండు రాష్ట్రాల అభివృద్దికి ఆయన పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల మేరకు రెండు రాష్ట్రాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషిచేస్తున్నారని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేసే క్రమంలో నల్గొండ జిల్లాలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించటం జరిగిందని తెలిపారు. అలాగే ప్రశ్నించేతత్వంతో పార్టీ ఏర్పడిందని ప్రజల సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకులనైనా, అధికారులనైనా ప్రశ్నిస్తుందని, తద్వారా సమస్యల పరిష్కారంలో ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పవన్ అలువాల, ప్రధాన కార్యదర్శి కాంపల్లి వెంకట్, సోషల్ మీడియా హెడ్ పూర్ణ చందర్ లొట్లపల్లి, కార్యదర్శి అశోక్, నాయకులు కార్తీక్ గౌడ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శివ సాయి, విద్యార్ది విభాగం కొఆర్డినేటర్ సతీష్, జన సైనికులు పాల్గొన్నారు.