
రాజంపేట ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు వచ్చి ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట మండలంలోని పెన్నపేరూరు, ఒంటిమిట్ట పట్టణం, గంగపేరూరు, తప్టేరపల్లి, నరసంగారి పల్లి, నరవకాటపల్లి, సాలాబాదు, చిన్న కొత్తపల్లి, చెర్లోపల్లి, దోమతెరువు పల్లి, దర్జీ పల్లి గ్రామాల లోని వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తలు రాజంపేట జనసేన పార్టీ నాయకులు యల్లటూరి శ్రీనివాస రాజు గారి నేతృత్వం లో 150 మంది జనసేనపార్టీలో చేరారు. జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు గారు సిద్ధవటం, ఒంటిమిట్ట ప్రధాన రహదారి ప్రక్కన ఉండే ఎస్. ఉప్పరపల్లి నందు ఉన్న నూతన జనసేన పార్టీ కార్యాలయంలో వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస్ రాజు గారు మాట్లాడుతూ ఒంటిమిట్ట మండలం నుంచి 11 గ్రామాల లోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీ కి మద్దతుగా వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జనసేన పార్టీ గెలుపుకు కృషి చేయాలని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని జనసేన, టిడిపి అలియన్స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ప్రజల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ప్రజలకి మీ ద్వారా నమ్మకం, భరోసా ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండలం జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన పార్టీ నాయకులు కొట్టే రాజేష్ పసుపులేటి కళ్యాణ్, ఒంటిమిట్ట జనసేన పార్టీ నాయకులు మధుస్వామి, జనసైనికులు మరియు ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.