
అమలాపురం ( జనస్వరం ) : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ఐటీ కో-ఆర్డినేటర్ తామేష్ గాలిదేవర ఆధ్వర్యంలో, జనసేన స్టేట్ ఐటి కో-ఆర్డినేటర్ పెన్నమరెడ్డి నాగబాబు ముఖ్య అతిధిగా శనివారం ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన స్టేట్ ఐటి కో-ఆర్డినేటర్ నాగబాబు పెన్నమరెడ్డి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలలో ఐటి టీం ను మరింత బలపరచాలని, ఓటరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఓటరు రిజిస్ట్రేషన్ పైలట్ ప్రాజెక్టు ను తొలుత పి.గన్నవరం నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించామని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైలట్ ప్రాజెక్టు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని దానిని మరింత ముందుకు తీసుకెళ్ళేలా ఆదేశాలిచ్చారని తెలిపారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ఐటీ కో-ఆర్డినేటర్ తామేశ్ గాలిదేవర మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాద్యతగా పనిచేయాలని త్వరలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో జిల్లా ఐటి కార్యకర్తలతో భారీ సమావేశాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 19 నియోజకవర్గాల ఐటీ కో-ఆర్డినేటర్లు మరియు మండల కో-అర్డినేటర్లు పాల్గొన్నారు.