మదనపల్లి ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మదనపల్లె ను జిల్లాగా ప్రకటించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మదనపల్లి జనసేన నాయకులు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి గారు ఇంకా తాను ప్రతిపక్ష నాయకుడిననే భావనలో వుండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేటు చేస్తోందని దారం అనిత తీవ్రంగా విమర్శించారు. తాను ముఖ్యమంత్రిననే స్పృహలోకి ఇప్పటికైనా ఆయన రావాలన్నారు. ఆయన ప్రతిపక్ష నాయకునిగా వున్నప్పుడు ఎన్నికల ప్రచార నిమిత్తం మదనపల్లి కు విచ్చేసి వేలాది మంది సమక్షంలో ఇచ్చిన హామీలను చేశారు. మదనపల్లెలో టొమాటో ప్రాసిసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తానని చెప్పడం, 3000 కోట్ల రూపాయలతో రైతులకు స్థిర నిధి ఏర్పాటు చేస్తానని చెప్పడం, ఇస్లామిక్ బాంక్ ద్వారా ముస్లిములకు రుణాలు అంశాలను గుర్తు చేశారు. అదేవిధంగా చాలాకాలంగా మదనపల్లికి సంబంధించిన డిమాండ్లలో భాగంగా మదనపల్లె నీటికొరత దృష్టిలో పెట్టుకుని కోట్లాది రూపాయలతో ఏర్పాటుచేసిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అసంపూర్తిగా ఉండడాన్ని పూర్తి చేయాలని, మదనపల్లెలో మెడికల్ కాలేజీ శంకుస్థాపన అయితే జరిగింది కానీ ఏమాత్రం పనులు ప్రారంభం కాని నేపథ్యంలో త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే మేం చెప్పిన డిమాండ్లన్నీ నెరవేరాలంటే ఉన్న ఒకే ఒక మార్గం మదనపల్లి జిల్లాగా ప్రకటించాలి. కావున ముఖ్యమంత్రి గారి నేటి పర్యటనలో మదనపల్లి ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్,శంకర్, వేణుగోపాల్, వెంకటేష్,దారం హరి తదితరులు పాల్గొన్నారు.