కళ్యాణదుర్గం, ఏప్రిల్ 11 (జనస్వరం) : కళ్యాణదుర్గం నియోజకవర్గం, బ్రహ్మసముద్రం మండలం, ముప్పలకుంట గ్రామంలో టిడిపి+జనసేన+బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతుగా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటా టిడిపి+జనసేన ఉమ్మడి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరపున ఇంచార్జ్ బాల్యం రాజేష్ & జిల్లా కార్యదర్శులు లక్ష్మీ నరసయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రచారంలో ఇంటింటికి మేనిఫెస్టో అంశాలను, సూపర్ సిక్స్ పథకాలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ శ్రీరాములు & జనసేన పార్టీ నుండి బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు అంజినేయులు, జనసేన వీరమహిళ అంజినమ్మ, కళ్యాణదుర్గం జనసేన వీరమహిళలు మమత, కల్పన, కంబదూరు మండల వీరమహిళ శ్రావణి, కంబదూరు మండల అధ్యక్షులు చంద్రమౌళి, ఉపాధ్యక్షులు వెంకటేష్, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, కళ్యాణదుర్గం ముఖ్య నాయకులు గంగరాజు, అనిల్ పాల్యం, చిత్తప్ప, సుధాకర్, రుహుల్ల, గాజులపల్లి రమేష్, కళ్యాణదుర్గం మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, బ్రహ్మసముద్రం మండల ప్రధాన కార్యదర్శులు తిప్పేరుద్ర, మండల కమిటీ సభ్యులు ముప్పలకుంట నీలకంఠ, రాము, గణేష్, విజయ్, బుడిమేపల్లి తిమ్మరాజు, కంబదూరు మండలం నుండి శ్రీకాంత్, ప్రకాష్, మంజు, నియోజకవర్గ జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ రాయుడు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com