తిరుపతి, మార్చి 18 (జనస్వరం) : తిరుపతిలో ప్రచారంలో భాగంగా తిరుచానూరు మాజీ సర్పంచ్ సీ.ఆర్ రాజన్ ని కలిసిన జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్. 44వ వార్డుకు చెందిన కువైట్ ప్రసాద్ జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అందులో భాగంగా అక్కడ ఉన్న కొందరు నాయకులు జనసేన కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఆనంద్, బాటసారి, నగర కార్యదర్సులు కిరణ్ కుమార్, మనోజ్ కుమార్, గౌస్ బాషా జనసైనికులు మోహిత్, బాలాజీ, నాని తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com