మంగళగిరి, (జనస్వరం) : మంగళగిరి నియోజకవర్గం నుంచి తాడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ కోలా రంగారావు జనసేన పార్టీలో చేరారు. జనసేన చేనేత వికాస విభాగం ఛైర్మన్, మంగళగిరి ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వీరు జనసేన కండువాలు కప్పుకున్నారు. వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన శ్రీ మనోహర్ గారు కలసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర IT విభాగం కో-ఆర్డినేటర్ చవ్వాకుల లీలా కోటేష్ బాబు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు మరియు జనసేన నాయకులు విష్ణుమెలకల శివ ప్రసాద్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com