
శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఉన్నత విద్యావంతులు RCR కాలేజి ప్రిన్సిపాల్, శ్రీకాళహస్తికి చెందిన Dr. N.G.A ప్రసాద్ వారి మద్దతు దార్లతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ప్రసాద్ గారికి నియోజకవర్గ ఇంఛార్జి వినుత కోటా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో ప్రసాద్ వైసీపీ పార్టీ గెలుపుకోసం చాలా క్రియాశీలకంగా పని చేసి, వారి కాలేజిలో చదువుకున్న వేల మంది స్టూడెంట్స్ సైతం శ్రీకాళహస్తి లో వైసీపీ గెలుపుకి పని చేశారు. ఈ 5 సం. పాలనలో ప్రజలు కోరుకున్న ఎలాంటి మార్పు జరగకపోవడంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే యువత ఆశించే మార్పు సాధ్యం అని నమ్మి ఈరోజు పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో తనకి విశేషంగా పరిచయాలు ఉన్న వేల మంది విద్యార్థులను సైతం శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ గెలుపు కొరకు కృషి చేసేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ఇంఛార్జి తోట గణేష్, మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల ఇంఛార్జి పేట చంద్రశేఖర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.