నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ 54 డివిజన్ భగత్ సింగ్ కాలనీ నుంచి వీరమహిళా నాయకురాలు హసీనా ఆధ్వర్యం లో దాదాపుగా 150 మంది జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు నిర్మించిన టిట్కో ఇళ్లను ఇప్పటికీ ఇవ్వడకపోవడంపై ప్రశ్నిస్తూ రేపటి రోజున ఇక్కడికి వస్తున్న జనసేన నాయకులకు మద్దతు ఇవ్వండి.. గళం వినిపించండి ప్రజల పక్షాన పక్షాన నిలబడడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గత మూడు నెలలుగా మైండ్ గేమ్స్ ఆడిన వైసీపీ నాయకులు నెల్లూరు నగరం నుంచి పరార్ అయిపోయారు. అనిల్ అన్నకి సిటీ టికెట్ అని చెప్పి ఐదు లక్షల బెట్టు కట్టిన జామకాయ కూడా కనిపించడం లేదని బయట సమాచారం. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీ ఖాళీ అవుతుంది. వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నెల్లూరు సిటీలో ఎవరు పోటీ చేస్తున్నారో ఇంకా ఎవరికి అర్థం కాని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాల తో ఎంతో ప్రజాదరణ జనసేన పార్టీ మద్దతు చేరింది. జరగనున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాయి. ప్రజా శ్రేయస్సు కోసం అడుగులు పడనున్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు షేక్ జానీ బాషా, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,54వ డివిజన్ జనసేన నాయకులు హసీనా, వినోద్,కుక్క ప్రభాకర్, సురేష్, శ్రీనివాసులు, జనసేన నాయకులు సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, ఏటూరి రవికుమార్, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు సుధా మాధవ్, వీర మహిళా నాయకురాలు హసీనా, కృష్ణవేణి, ప్రసన్న, సుభాషిని, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com