ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణంలోని 32 వ వార్డ్ దుర్గ నగర్ కు చెందిన 10 కుటుంబాలు చేరడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు, అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలా గా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ షాహిద్, దేవిపురం రామాంజి, సాకే చంద్ర, కంసల శేషు, కంసల ప్రవీణ్, మల్లెల వెంకటేష్, వేలపుమడుగు సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.