పిఠాపురం ( జనస్వరం ) : మున్సిపాలిటీ 23,24,వ వార్డులలో నుంచి పిఠాపురం వైస్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్ల భీమేశ్వరరావు ఆధ్వర్యంలో పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారి సమక్షంలో వైసిపి, టిడిపి, పార్టీకి చెందిన 25 మంది పెద్దలు, యువకులు జనసేన పార్టీలో చేరారు. ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి మరియు టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్యప్రకాశరావు పార్టీ కండువా వేసి సాధనంగా ఆహ్వానించారు. అనంతరం శేషుకుమారి గారు మాట్లాడుతూ త్వరలో ఎలక్షన్ రాకపోతున్నాయి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని యువతులకు పెద్దలకు తెలియజేశారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ రోజురోజుకు పుంజుకుంటుందన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి భారీ స్థాయిలో జనసేనలో చేరికలు పెరిగిపోయాయన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించడం ఖాయమని, పిఠాపురం నియోజకవర్గంలో వైసిపి నాయకులు జనసేన తీర్ధం పుచ్చుకోవడానికి సిద్దంగా ఉన్నారన్నారు. 2024 ఎన్నికల తర్వాత వైసిపి పార్టీ ఖాళీ అవుతుందన్నారు. పార్టీలో చేరిన వారు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను అనుగుణంగా పని చేసి రాబోయే రోజుల్లో అధికారం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాష్ రావు, టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోల దుర్గ, టౌన్ వైస్ ప్రెసిడెంట్ లు కసిరెడ్డి నాగేశ్వరరావు, వేల్పుల చక్రధర్, ప్రధాన కార్యదర్శి, బొజ్జా కుమార్, కార్యదర్శి పబ్బినీడి దుర్గాప్రసాద్, మండల్ ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, పట్టా శివ,గోపు సురేష్, దొడ్డి దుర్గాప్రసాద్, కంద సోమరాజు, మెరుగు ఇజ్రాయిల్, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.