
కర్నూలు ( జనస్వరం ) : జనసేన సిద్దాంతాలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి కర్నూలు జిల్లా యువత జనసేన పార్టీలోకి చేరారు. రాష్ట్ర ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడవడానికి కోడుమూరు నియోజకవర్గం పసుపుల గ్రామం నుంచి ముందుకు వచ్చిన 40 మంది మైనారిటీ, SC మరియు ST యువకులను పాణ్యం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చింతా సురేష్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.