అనంతపురం ( జనస్వరం ) : జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి కళ్యాణదుర్గం మండలంలోని పులికల్లు, ఇట్లంపల్లి గ్రామాల్లో ఉన్న 20మంది పార్టీలోకి చేరారు. రాబోయే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనసేన పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకు వెళ్లాలో, ప్రజాసమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వటం జరిగింది. యువతకు పెద్దపీట జనసేన పార్టీ వేస్తుందని యువత ద్వారానే సమాజంలో, రాజకీయాలలో అవినీతి ను నియంత్రించగలము అని వివరించడం జరిగింది. అలాగే కళ్యాణదుర్గం పట్టణ కమిటీలు గురించి చర్చించడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ కొత్తగా పార్టీలోకి జాయిన్ అయినవారు జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి లక్ష్మి నరసయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, మండల అధ్యక్షుడు షేక్ మొహిద్దిన్ మరియు జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com