Logo
Date of Publish : 03 July 2021, 5:49 am
Editor : Sake Naresh

కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీ లోకి చేరికలు

             బోగోలు మండలం, కావలి నియోజకవర్గం రైల్వే బిట్రగుంట లో తెలుగుదేశం పార్టీకి చెందిన లీడర్ షేక్ నూరుద్దిన్ ఈ రోజు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ అళహరి సుధాకర్ గారు కండువా కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ గారు మాట్లాడుతూ నూరుద్దిన్ ఎంతో కాలంగా బిట్రగుంటలో మంచి సేవా దృక్పదంతో రైల్వే పరంగా అయితే ఏమి ఊరు అభివృధి చెందాలి అనే మంచి దృడ సంకల్పంతో ఉన్న వ్యక్తి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశలకు ఆశయాలకు ఆకర్షితుడై పార్టీలోకి రావడము ఎంతో ఆహ్వానించ దగ్గ విషయం అని అన్నారు. ఇంకా ఎంతో మంది వివిధ పార్టీల నుండి త్వరలో జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. బోగోలు మండలంలో పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేయడానికి తను కృషి చేస్తానని, జనసేన పార్టీలో కావలి నియోజకవర్గ ఇంఛార్జ్  అళహరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో పార్టీ లో చేరడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అని నూరుద్దిన్ అన్నారు. సురేష్ కూడా ఈ రోజు అధికారికంగా జనసేన పార్టీలోకి అళహరి సుధాకర్ గారి ఆధ్వర్యం లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమములో కావలి టౌన్ ప్రెసిడెంటు పబ్బా సాయి, శివశంకర్, YVP రెడ్డి  జనసేన నాయకులు, జనసైనికులు  మరియు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com