Logo
Date of Publish : 29 March 2023, 3:50 pm
Editor : Sake Naresh

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేనలోకి వైసీపీ కార్యకర్తల చేరికలు

     విశాఖపట్నం ( జనస్వరం ) : జనసేన సీనియర్ నాయకులు టి.శివ శంకర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. దక్షిణ నియోజక అల్లిపురం నేరెళ్ల కోనేరు వద్ద బుధవారం దక్షిణ నియోజక వర్గంనకు చెందిన సుమారు వందమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయుకులు జనసేనలోకి చేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివ శంకర్ మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను జనసేన పార్టీ శాసిస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాబోయే రోజులలో వైసిపి నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉందని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం అయిందని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పు ఖాయమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు డా.బొడ్డేపల్లి రఘు ,శివప్రసాద్ రెడ్డి , డాక్టర్ మూగి శ్రీనివాస్,తెలుగు అర్జున్ , తెలుగు లక్ష్మి , ఉసిరిగాయల యజ్ఞశ్రీ, యర్రం శెట్టి సురేష్ కుమార్ , లంక త్రినాధ్ , బెజవాడ హరికృష్ణ , అంతోని , ప్రణీత్ , రఘు , త్రినాధ్ , రూపా , మంగ , కందుల బద్రీనాథ్ , కందుల కేదార్నాథ్ ఇతర జనసేనుకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com