నెల్లూరు ( జనస్వరం ) : జనసేన రూరల్ నాయకులు భాను,హేమచంద్ర యాదవ్, సురేష్ ఆధ్వర్యంలో దాదాపు 50 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరాయి. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇందిరమ్మ కాలనీ నుంచి దాదాపు 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇందిరమ్మ కాలనీ అంటే ఉదయాన్నుంచి సాయంత్రం దాకా ప్రతి ఒక్కరు కష్టపడు కష్టపడి జీవనం సాగించే వారే... పవన్ కళ్యాణ్ గారు కష్టానికి చాలా విలువ ఇస్తారు శ్రామికుల కష్టం తెలిసే విధంగా ఎప్పుడూ ఎర్రతుండు భుజాలపై మోస్తూనే ఉంటారు. ఎంతోమందికి ఆయనంటే అభిమానం,ఆయన చేసే పనులు మీద నమ్మకం. కానీ కొంతమంది పెత్తందారుల వల్ల అందరూ బయటికి రాలేకున్నారు. వారందరికీ తోడుగా మేము ఉంటాం ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే గాని, చట్టపరంగా గాని జనసేన పార్టీ జిల్లా యంత్రాంగం మొత్తం మద్దతుగా నిలుస్తామని మాటిస్తున్నాను. ఓటర్ల కొత్త జాబితా రాగానే ప్రతి వార్డులో వెరిఫికేషన్ జనసైనికులతో చేపట్టి బూతు లెవల్లో ప్రతి వార్డులో కూడా జనసైనికులని నిలిపే ప్రయత్నం చేస్తాం. నెల్లూరు రూరల్ లో చాలామంది పెత్తందారులు వెనుకబడిన వర్గాలకు చెందిన కొంతమందిని గుప్పిట్లో పెట్టుకొని మిగిలిన వారిని భయభ్రాంతులను చేస్తూ వాళ్ళ సుప్రయోజనాల కోసం వాళ్ళు ఎదుగుదల కోసం వాడుకుంటున్నారు. పార్టీలో చేరిన వారు ఎలాగో జనసేన పార్టీకి ఓటు వేస్తారు మిగిలిన వారిని అందరూ కూడా ప్రభావితం చేసే విధంగా మీరందరూ చేతులు కలిపి జనసేన కి పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వాలి. అమాయక ప్రజలను మోసపుచ్చే విధంగా వారికి వారి కక్షలకు,దాడులకు మిమ్మల్ని రూరల్ ఏరియా లో పెత్తందారులు ఉపయోగించుకుంటున్నారు. జాగ్రత్తగా వ్యవహరించండి మన కోసం, కుటుంబం కోసం,సాటి మనుషుల ఎదుగుదల కోసం ఎంతైనా కష్టపడండి, ఎంతైనా పోరాడండి. పెత్తందారులు వారి స్వప్రయోజనాల కోసం మీరు బలి పశువులు కాకండి. జనసేనకు అధికారమిస్తే అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్న అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని నిజం చేసి చూపిస్తాం. పేదలు చక్కగా చదివించుకోవాలంటే పిల్లలకు సరైన విద్య అందడం లేదు, ఆరోగ్యం సరి లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పెద్ద అనారోగ్యం చేస్తే చూపించుకోలేని పరిస్థితి,రాష్ట్ర జిల్లా దాటి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. పేదలకు ఉచిత విద్య,వైద్య విధానాల్ని పెంపొందిస్తాం జనసేన పార్టీ అధికారంలోకి వస్తే .. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ యొక్క బలం నిరూపించేందుకు జనసేన నాయకులు కృషి చేస్తున్నారు. స్థానిక నాయకులు ఎదిగేందుకు వారికి మేము అండగా ఉంటాం,మీ ఇబ్బందులు తొలగాలంటే మీలో నుంచి నాయకులు రావాల్సిందే.కొత్త నాయకత్వానికి జనసేన స్వాగతం పలుకుతుంది.. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ సురేష్, నగేష్, శ్రీను, శ్రావణ్, హేమచంద్ర యాదవ్, భాను, బన్నీ, చిన్న రాజా, షాజహాన్, ఖలీల్, బన్నీ, వర తదితర వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com