
పాయకరావుపేట : (జనస్వరం) నక్కపల్లి మండలం వేంపాడు గ్రామానికి చెందిన వైసీపీ మరియు టీడీపీ పార్టీకి చెందిన సుమారు 50 మంది దళితులు జనసేన పార్టీకి ఆకర్షితులై జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. వీరికి బుజ్జి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బుజ్జి మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పార్టీ నుంచి మరియు నా నుంచి మీకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చిన నిరంతరం అందుబాటులో ఉంటానని జనసైనికులకు వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిరియాల అప్పారావు, తాతపూడి రాంబాబు, కాండ్రకోట నూకరాజు, నాగన్న, లోవరాజు, యేసు, రమణ,జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.