కొత్తపేట ( జనస్వరం ) : ఆలమూరు మండలం, కలవచర్ల గ్రామంలో జనసైనికులు ఆదివారం జనసేన ఇంఛార్జి బండారు శ్రీనివాస్ కు ఘనస్వాగతం పలికి కొత్తూరు సెంటర్ నుండి కలవచర్ల గ్రామము ఎస్సీ పేట వద్దగల డా. బాబు జగ్జీవన్వన్ రాం విగ్రహం వరకు బారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళుర్పించిన ఆయన్ను అక్కడ నుండి కాలి నడకన ఆకులమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. వైఎస్ఆర్సిపి మరియు టిడిపి పార్టీల నుండి భారీ ఎత్తున గుత్తుల నాగేశ్వరరావు(టీడీపీ గ్రామ ఉప సర్పంచ్) వైసిపి వనుం రమేష్ ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. పలు సామాజిక వర్గాల నుండి(ఎస్సీ, బీసీలు) సుమారు 150 మందికి పైగా జనసేన కుటుంబంలోకి వచ్చిన వారిని పార్టీ కండువా కప్పి బండారు శ్రీనివాస్ సాధరంగా ఆహ్వానించారు. అనంతరం బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ నాయకత్వం పఠిమ, పార్టీ సిద్ధాంతాలు, భావజాలానికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన పలువురు జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు. సీఎం జగన్మోహనరెడ్డి చేస్తున్న కుట్రలు, ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, మోసపూరిత నాయకుల మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషిచేయాలని పిలువునిచ్చారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఆసరాగా ఉండి, అధికారం లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి, మచ్చ లేని నాయకుడుగా ప్రజల అభిమానం సంపాదించుకొన్న పవణ్ కళ్యాణ్ ను సీఎం చేయడం కొరకు పతి ఒక్కరూ సిద్ధపడి ఉన్నారని, పేదలకు బరోసా ఇచ్చే నాయకుడు పవన్ కళ్యాణ్ అనే ధీమా ప్రజల్లో ఉంది కాబట్టి వైసీపీ, టీడీపీ పార్టీలకు గుడ్‌బై చెప్పి జనసేన పార్టీలో చేరారని చెప్పుకొచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com