గుంతకల్ ( జనస్వరం ) : పట్టణంలోని ధోనిముక్కల రోడ్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన పలువురి యువకులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మరియు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన, కౌలు రైతుల సంక్షేమం కోసం ఆయన ప్రారంభించిన కౌలు రైతుల భరోసా యాత్ర మరియు కార్యకర్తల కోసం ఆయన తీసుకువచ్చిన క్రీయాశీలక సభ్యత్వం లాంటి నిర్ణయాలు నచ్చి యువకులు జాయిన్ అయ్యారు. గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ గారి సమక్షంలో సుమారు 60 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన పలువురు యువకులు మరియు సీనియర్ నాయకులు మాట్లాడుతూ 2024 లో “ప్రజా ప్రభుత్వం” జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సాకారంతో ఏర్పాటు చేసే దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. జనసేన పార్టీ చేస్తున్న పోరాటాలను, నిస్వార్థ సేవలను, కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలబడిన తీరును క్షేత్రస్థాయిలో గ్రామగ్రామాన తెలిసేవిధంగా అలాగే వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ప్రజలను నిత్యం చైతన్య పరుస్తూ సామాన్యులకు అండగా జనసేన పార్టీ ఉండేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్ మైనారిటీ నాయకుడు మెకానిక్ దాదు, సీనియర్ నాయకులు ఆటో రామకృష్ణ, పామయ్య, ధనుంజయ, కసాపురం నంద, సుబ్బయ్య, గాజులు రాఘవేంద్ర, కత్తుల వీధి అంజి జనసైనికులు అమర్, రామకృష్ణ మంజునాథ్, పరుశు, ప్రకాష్, వెంకటేష్, రంగా, సందీప్ ఇందిరమ్మ కాలనీ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com