Logo
Date of Publish : 30 September 2023, 10:14 pm
Editor : Sake Naresh

వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో జనసేనపార్టీలోకి చేరికలు

           పాడేరు ( జనస్వరం ) : చింతలవీధి పంచాయితి నడిమివీధి, ఉబ్బెడు పుట్టు గ్రామా ప్రజల ఆహ్వానం మేరకు ఈ రోజు గ్రామస్తులతో సమావేశమైన జనసేనపార్టీ నాయకులు. స్థానిక నడిమి వీధి గ్రామ నాయకులు సుమన్, సుబ్బారావుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేనపార్టీ పాడేరు (అరకు పార్లమెంట్) ఇన్చార్జ్ డా..వంపూరు గంగులయ్య మరియు జనసేనపార్టీ నాయకుల బృందం హాజరయ్యారు. ఈ సందర్బంగా ముందుగా స్థానిక గ్రామస్తులు గంగులయ్యగారితో మాట్లాడుతూ అనేక ఎన్నికలు చూస్తున్నాం కానీ మా గ్రామానికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని దుస్థితి పై ఎవ్వరు స్పందించట్లేదు. జిల్లా ప్రధాన కేంద్రానికి అతి దగ్గరలో ఉన్న మాకే అనేక సమస్యలున్నాయి.మౌళికసధుపాయలు కల్పనలో స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులకు శిత్తశుద్ధి లేదు ఇకా మారుమూల పల్లెలు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటాయో అర్థమవుతుందన్నారు. మా గ్రామ భూములు వైసీపీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి, వారి పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి మా అనుమతి లేకుండా ఏ అధికారంతో నిర్ణయం తీసుకుంటారో అర్థం కావట్లేదని వాపోయారు. గ్రామస్తులతో గంగూలయ్య మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని అనేక రంగాల్లో వైపల్యం చెందిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి మాట తప్పుతూ పాలన చేస్తున్న దుర్భర స్థితి ఈ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే గిరిజనులు తమ అస్తిత్వం కోల్పోయే దుస్థితికి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు రైతులు, శ్రామికులు, నిరుద్యోగులకు, ఇలా అనేక రంగాల్లో ఉన్న వివిధ రకాల వర్గాల ప్రజలందరినీ ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. మేము ఇవాళ మీ గ్రామానికి జనసేనపార్టీ నాయకులుగా వచ్చాము మా వెనకాల తెల్ల చొక్కాలు వేసుకుని అవినీతి అక్రమాల్లో పేరున్న నాయకులు లేరు అందరూ యువకులు వున్నారు. వాళ్ళలో మన గిరిజన సమాజానికి ఎంతో కొంత మేలు చెయ్యాలనే తపన ఉన్న నవతరం నాయకులు వున్నారన్నారు.

      మన గిరిజన పల్లెల అభివృద్ధి ఉంటుంది. మా రాజకీయాలు విలువలతో ఉంటుంది. జాతి అస్తిత్వాన్ని సూటుకేసుల్లో బందించేంత బలహీనమైన రాజకీయాలు మేము చేయలేము గిరిజన జాతి రక్షణ దృష్ట్యా రణమే శరణమని నమ్మి బలమైన సంకల్పంతో ఉరికే యువతరంతో రాజకీయాలు చేస్తున్నాం. మీకు ఈ రోజు మాట ఇస్తున్నాం. మీ గ్రామనికి సంబంధించి భూమి విషయంలో అది మీ హక్కు ,మీ ఆస్తి మీరు మాకు తోడుంటే మీ ఉద్యమానికి తొలి అడుగు గా మేముంటం. అవసరమనుకుంటే న్యాయపోరాటంలో ముందుండి నడిపిస్తాం. ఖచ్చితంగా అహంకారుల కొమ్ములు విరుస్తాము. జాతి సంరక్షణ,నిర్మాణం మా ప్రధమ బాధ్యతలు మనమందరు కలిసి సాగుదాము గిరిజన బ్రతుకుల్ని బలి పశువు చేసి పబ్బం గడుపుకునే స్వార్ధపు నాయకత్వాన్ని ఎదురిద్దాం. అది రాష్ట్ర ప్రభుత్వమైనా,కేంద్రప్రభుత్వమైన మనమంతా సమిష్టిగా ఎదుర్కొందాం. మన యుద్ధంలో ధర్మం ఉంటే మనం కచ్చితంగా విజయంసాధిస్తామన్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులందరు జనసేనపార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై డా.. గంగులయ్య గారి చేతుల మీదుగా కండువాలు కప్పుకుని జనసేనపార్టీ లో చేరి మేమంతా మీ వెంటనని గెలుపు కోసం మా శక్తి వంచన లేకుండా శ్రమిస్తామన్నారు.వారికి పార్టీలోకి ఇన్చార్జ్ గంగులయ్య సాదరంగా ఆహ్వానించారు.ఈ సమావేశంలో జనసేనపార్టీ నాయకులు సుమన్, సుబ్బారావు, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్,వీరమహిళ దివ్యలత, మజ్జి సత్యనారాయణ, సాలేబు అశోక్, లక్ష్మయ్య, సంతోష్ స్థానిక గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com