Logo
Date of Publish : 29 October 2023, 7:43 pm
Editor : Sake Naresh

హరిప్రసాద్ ఆధ్వర్యంలో జనసేనపార్టీలోకి చేరికలు

   తిరుపతి ( జనస్వరం ) : చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ అడ్వకేట్ యండమూరి నాగేంద్రబాబు జనసేన పార్టీలో చేరారు. తిరుపతిలోని జనసేన PAC కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు అడ్వకేట్లు శరణ్ కుమార్, తరుణ్ ప్రకాష్ లు పార్టీలో చేరారు. వారితో పాటు దాదాపు 30 మందికి పైగా యువత పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ భావజాలానికి ఆకర్షితులైన ఎంతో మంది ప్రముఖులు పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముక్కు సత్యవంతుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, నగర ఉపాధ్యక్షులు పార్ధు, కొండా రాజమోహన్, కార్యదర్శులు కిరణ్ కుమార్, రవి, సాయి, పురుషోత్తం రాయల్ , సీనియర్ నాయకులు ఈశ్వర్ రాయల్, వంశీ, హిమావంత్,తిరుపతి అర్బన్ నాయకులు, జనసేన సాయి, తిరుపతి రూరల్ నాయకులు మనోజ్ కుమార్, గౌస్ బాషా, జనసైనికులు మోహిత్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com