Logo
Date of Publish : 02 October 2023, 8:54 pm
Editor : Sake Naresh

గంగులయ్య ఆధ్వర్యంలో జనసేనపార్టీలోకి చేరికలు

       పాడేరు ( జనస్వరం ) : స్థానిక నాయకులు రాజుబాబు, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ ల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా..గంగులయ్య, మసాడి భీమన్న తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా డా..గంగులయ్య మాట్లాడుతూ ప్రభుత్వానికి గిరిజన స్థితిపై చిత్తశుద్ధి లేదని గడిచిన నాలుగేళ్లలో మనమంతా చూసేసామన్నారు. ప్రతి గిరిజన పౌరుడు వాస్తవిక రాజకీయాలపై క్షున్నంగా తెలుసుకోవాలని జాతి ఆస్తిత్వంపై జరిగే ప్రభుత్వాల కుట్రలను పసిగట్టి చర్యలు తీసుకోనటువంటి నాయకత్వం మనకు వద్దని గిరిజన ప్రజలను చైతన్యవంతం చెయ్యాల్సిన బాధ్యతలు గిరిజన యువత తీసుకోవాలని అన్నారు. లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మాట్లాడుతూ మన హక్కులు, చట్టాలు మన ప్రాంత భౌగోళిక పరిస్థితులు తెలిసిన నేత గా గంగులయ్య గారిని చట్టసభల్లో పంపించగలిగితే కనీసం జాతిపై చట్టసభల్లో జరుగుతున్న నష్టాలపైన ఎదుర్కోవచ్చు. ఇలా కాకుండా ప్రస్తుతం ఉన్న మన నాయకులు అసెంబ్లీలో వాదన ప్రతి వాదనలు జరుగుతుంటే దిక్కులు చూడటం, కిటికీలు చూస్తూ గడియరాలలో అంకెలు లెక్కబెడుతూ ప్రభుత్వం ఏది చెప్తే అదే శిరోదార్యమంటూ బానిసత్వం ప్రకటించడం చూస్తుంటే మన జాతి ని తాకట్టు పెట్టేసారని సామాన్య గిరిజనులకు కూడా అర్ధమవుతుంది. ఇలాంటి పాలకులు మనకు అవసరమా? ఈ సారి మనం మేల్కొకపోతే తగిలే దెబ్బకి భవిష్యత్ తరాలు నాశనం అయిపోతుంది ఇప్పటికైనా మేల్కొనండి అన్నారు. భీమన్న మాట్లాడుతూ మనమంతా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలంటే కలిసి ప్రయాణం చెయ్యాలి మన గిరిజన అస్తిత్వం కాపాడుకోవాలి. మన గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగకల్పన,గ్రామసీమల అభివృద్ధి కావాలంటే జనసేనపార్టీ ప్రభుత్వం స్థాపించాలన్నారు ఈ సందర్బంగా జనసేనపార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు,నిర్దిష్ట్యా లక్ష్యాలు నచ్చి లబ్బంగి గ్రామస్తులు జనసేనపార్టీ కండువాలు డా..గంగులయ్య చేతులమీదుగా కప్పుకుని పార్టీలోకి చేరారు. వారికి సాదరంగా జనసేనపార్టీ లో గంగులయ్య గారు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాజుబాబు, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్,మసాడి భీమన్న, తాంగుల రమేష్,పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్,మజ్జి సత్యనారాయణ,మజ్జి సంతోష్,అశోక్, గూడెం మండల నాయకులు అరడ కోటేశ్వరరావు, వనగరి ఈశ్వర్రావు,చింతపల్లి నాయకులు, శెట్టి స్వామి, శేఖర్ తదితర జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com