రాజాం ( జనస్వరం ) : జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి రాజాం టౌన్ కు చెందిన పలువురు యువకులు ఈరోజు రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో యు.పి.రాజు సమక్షంలో చేరడం జరిగింది. వారికి జనసేన వీరమహిళ ఎమ్.కుమారి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. నాయకులు యు.పి.రాజు పార్టీ లో చేరిన వారికి పార్టీ సిద్ధాంతాలు మ్యానిఫెస్టో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీటీసీ అభ్యర్థి సామంతుల రమేష్, దుర్గారావు, హరిబాబు, సంతోష్ తదితరలు పాల్గొన్నారు.