శ్రీకాళహస్తి ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి శ్రీకాళహస్తి పట్టణం 9 వ వార్డు, పి.వి. స్ట్రీట్ నుండి తోటకారి అరుణ్ గారి నేతృత్వంలో 50 మంది యువకులు, మహిళలు జనసేన పార్టీలో చేరారు. పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, పేట చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా స్థానిక పార్టీ కార్యాలయంలో వారికి జనసేన కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినుత గారు మాట్లాడుతూ పెద్ద ఎత్తున శ్రీకాళహస్తి పట్టణం నుండి జనసేన పార్టీకి మద్దతుగా వచ్చిందుకు వారిని అభినందిస్తూ, పార్టీ గెలుపుకు కృషి చెయ్యాలని, కష్ట పడ్డ ప్రతి ఒక్కరికీ పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని అన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక ప్రజల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ప్రజలకి మీద్వారా భరోసా ఇవ్వాలని తెలిపారు. కొత్తగా చేరిన వారిలో సారిక, లక్ష్మి, లావణ్య, జయంత్, గణేష్, మనోజ్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ కావలి శివ కుమార్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, నాయకులు గురవయ్య, ఉదయ్ కుమార్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com