Logo
Date of Publish : 20 January 2024, 8:39 pm
Editor : Sake Naresh

పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీ నుండి జనసేన పార్టీలోకి చేరిక

  పత్తికొండ ( జనస్వరం ) :  జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ బాద్యుడు సిజి రాజశేఖర్  అధ్యర్యంలో పార్టీ ఆఫీస్ నందు ఆగవేలి గ్రామ వైస్సార్సీపీ నాయకులు పార్టీలోకి చేరారు. బోయ రామలింగి బాలు, బోయ కుమార్ నాయుడు, బోయ మహేంద్ర, బోయ కృష్ణ, మునుస్వామి, రంగడు,  మహేష్ మరియు ఆ గ్రామ వైస్సార్సీపీ నాయకులు, క్రిష్ణగిరి జనసేన పార్టీ మండలం నాయకులు బోయపులి శేఖర్ అధ్యక్షతన జనసేన పార్టీలో చేరారు. ఆగవెల్లి గ్రామములో ఎటువంటి అభివృద్ధి పనులు గ్రామంలో జరగలేదన్నారు. వైయస్ఆర్సిపి పార్టీలో మేమంతా ఎంతో కష్టపడి ఎమ్మెల్యే గారిని సర్పంచ్ గారిని గెలిపించుకున్న, ఎవరికి కూడా న్యాయం జరగలేదు. అందుకే వైస్సార్సీపీ మాకు వద్దు జనసేన ముద్దు అని,, అందరికీ న్యాయం జరగాలంటే జనసేన పార్టీతోనే సాధ్యం న్యాయం జరుగుతుందని అన్నారు. దాదాపుగా 10 కుటుంబములు జనసేనలో చేరడం జరిగినది. సిజి రాజశేఖర్ మాట్లాడుతూ, ఈరోజు నుండి మీకు మీ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరఫున మేము ఎప్పుడూ అండగా ఉంటామని, మీరు ఎవరు కూడా భయపడకుండా పార్టీని ఇంకా బలపేతం చేయాలని మీకు న్యాయం జరిగే విధంగా మీ అంటే మేము ఉంటామని అన్నారు.అధ్యక్షులు నిర్ణయానికి కట్టుబడి మనం పని చేయాలని, మరో మూడు నెలల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఎలక్షన్ కోసం ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని, ప్రజలు వైసిపికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. గ్రామాలలో అభివృద్ధి నోచుకోలేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com