నెల్లూరు ( జనస్వరం ) : ఇండ్ల వనమ్మ అంగన్వాడీ కార్యకర్తల పోరాటంలో అసువులు బాసిన రమణమ్మ గారికి రూ 70000 ఆర్థిక సాయం చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు మద్దతుగా ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నిలిచారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో జగన్ గారు అంటే నాకు అంత ఇష్టమే. అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతాను అన్న జగన్ మాట తప్పడం నాకేమీ నచ్చలేదు. ప్రసవం తర్వాత నా భార్య ఇద్దరు బిడ్డలతో ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు అటువంటిది ఎంతోమంది బిడ్డలని ఓర్పుతో ఆదరిస్తున్న అంగన్వాడి తల్లులని న్యాయమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com