Logo
Date of Publish : 05 February 2022, 4:30 pm
Editor : Sake Naresh

జోహరాపురం వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి : జనసేన నాయకులు పవన్ కుమార్

    కర్నూలు, (జనస్వరం) : కర్నూలు పాత నగరం నుండి జోహరాపురంను కలిపే వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జనసేన పార్టీ జిల్లా నాయకులు పవన్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక కర్నూల్ నగరంలోని జోహరాపురం వంతెన నిర్మాణ పనులను జనసేన పార్టీ కర్నూలు జిల్లా బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు పవన్ కుమార్ మాట్లాడుతూ 2018లో గత టిడిపి ప్రభుత్వం హయాంలో జోహరాపురం వంతెన నిర్మాణం పనులు ప్రారంభించినప్పటికీ నేటికీ పూర్తి కాకపోవడం దుర్మార్గమైన విషయం అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2019లో జోహరాపురం వంతెన నిర్మాణం పనులపై వైసీపీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కర్నూలులో నిరసన కార్యక్రమం చేపట్టిన ఇప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. ప్రజలకు నిత్యం ఉపయోగపడే జోహరాపురం వంతెన నిర్మాణం పనులకు వెంటనే నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని లేని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాలిక్, మహబూబ్, శశావల్లి పాల్గోన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com