Search
Close this search box.
Search
Close this search box.

భారత్ ఎలక్ట్రానిక్స్ లో జాబ్స్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్

భారత్ ఎలక్ట్రానిక్స్

        నిరుద్యోగులకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు నోటిఫికేషన్ (BEL Notification) విడుదల చేసింది. ట్రైనీ ఇంజనీర్ -I, ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ -I ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు bel-india.in వెబ్ సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఉద్యోగాలు .. జాబ్ ప్రొఫైల్, కెరీర్ గ్రోత్, జీతభత్యాలు వంటి వివరాలు..!

ఖాళీల వివరాలు:

S.No. పోస్టు ఖాళీలు
1. ట్రైనీ ఇంజనీర్-I (ఎలక్ట్రానిక్స్) 8
2. ట్రైనీ ఇంజనీర్ -I(మెకానికల్) 28
3. ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I(ఎలక్ట్రానిక్స్) 8
4. ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I(మెకానికల్) 8
5. ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I(సివిల్) 1
6. ప్రాజెక్ట్/ఇంజనీర్-1(హెచ్ఆర్) 1
7. ప్రాజెక్ట్ సైట్ 3
మొత్తం: 57

విద్యార్హతలు: బీఈ/బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర వివరాలను నోటిఫికేషన్ చూసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు:ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు రూ.472, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు రూ.177 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎలా అప్లై చేయాలంటే:

Step-1: అభ్యర్థులు ముందుగా bel-india.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి

Step-2: హోం పేజీలో కెరీర్ ట్యాబ్ ను ఓపెన్ చేయాలి.

Step-3: తర్వాత సంబంధిత పోస్టు అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.

Step-4: అప్లికేషన్ ఫామ్ ను నింపి, కావాల్సిన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలి.

అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Step-5: ఫామ్ ను సబ్మిట్ చేసి భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ కాపీని భద్రపరుచుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

నోటిఫికేషన్
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. 875 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే!
డీఎస్సీ
టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్..
ఇస్రో
డిగ్రీ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు..
గుంటూరు
ఏపీ ఎస్ఐ - గుంటూరు రేంజ్ లో దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way