Logo
Date of Publish : 25 September 2021, 1:08 pm
Editor : Sake Naresh

జీవో నెంబర్ 50ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి : విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్

జీవో నెంబర్ 50ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి
- ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 50 విడుదల చేసింది
- లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రభుత్వంలో కలిపేందుకు ఎయిడెడ్ స్కూల్ మరియు కళాశాల యాజమాన్యాలు ఒప్పుకోనందున జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు
- మెగా డీఎస్సీ నిర్వహించకూడదని రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పెంచాలనే కుట్రలో భాగంగానే ఎయిడెడ్ విద్యా వ్యవస్థను రద్దు చేశారు
- ఒక్క పశ్చిమ నియోజకవర్గం లోని సుమారు 12 వేల మంది పిల్లలు ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్నారని వారి గురించి కనీసం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలోచన చేయలేదు
     విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 50 విడుదల చేసిందని, ఎయిడెడ్ విద్యా వ్యవస్థను రద్దు చేయడం అంటే పేద సామాన్య వర్గాల పిల్లలకు ఉచిత విద్యను దూరం చేయడమేనన్నారు. జీవో నెంబర్ 50ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని,ఈ చీకటి జీవో వలన రాష్ట్రంలో 2.5 లక్షల మంది స్కూల్ స్థాయి విద్యార్థులకు, 1.5 లక్షల మంది కళాశాల విద్యార్థులకు ఉచిత విద్య దూరమైపోతుందని, ఈ చీకటి జీవో వలన 1927 ఉచిత విద్యను అందించే ఎయిడెడ్ పాఠశాలలు మూతపడ్డాయని, ఎయిడెడ్ పాఠశాలను రద్దు చేయడం వలన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఇకనుంచి మధ్యాహ్న భోజన పథకం, డ్రస్సులు పుస్తకాలు బ్యాగులు బూట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించకూడదని రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పెంచాలనే కుట్రలో భాగంగానే ఎయిడెడ్ విద్యా వ్యవస్థను రద్దు చేశారని, ఎయిడెడ్ స్కూల్, కళాశాల యాజమాన్యాలను ఒత్తిడి చేసి అంగీకార పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేయిస్తుందని తెలిపారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎయిడెడ్ స్కూల్లో నియామకాలపై బ్యాన్ విధించారని, నేడు వైఎస్ జగన్ ఎయిడెడ్ స్కూల్ విద్యా విధానాన్ని పూర్తిగా నిలుపుదల చేశారని, నాడు తండ్రి నేడు కొడుకు ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని, లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రభుత్వంలో కలిపేందుకు ఎయిడెడ్ స్కూల్, కళాశాల యాజమాన్యాలు ఒప్పుకోనందున జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు. ఎయిడెడ్ పాఠశాలలు మూసి వేయడం వల్ల ఇక నుంచి పట్టణ ప్రాంతాల్లో పిల్లలు ప్రైవేట్ స్కూల్ లోనే ఫీజులు కట్టుకొని చదువుకోవాలని, అమ్మఒడి కూడా ఇక నుంచి కేవలం మూడు నాలుగు నెలలు మాత్రమే పిల్లలకు ఫీజులు కట్టుకునేందుకు సరిపోతుందన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో దుర్మార్గమని, రెండున్నర లక్షల మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులను జగన్ ప్రభుత్వం నడిరోడ్డుపై పడేసిందని, పట్టణాల్లో ప్రభుత్వ పాఠశాల అసలు లేవని అందువలన పట్టణాల్లో చదివే పేద సామాన్య వర్గాల పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారబోతుందని, బలవంతంగా ఎయిడెడ్ స్కూల్, పాఠశాల యాజమాన్యాలపై అంగీకార పత్రాలపై సంతకాలు పెట్టించుకోడం దుర్మార్గమని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 50 ఉపసంహరించుకుని ఎయిడెడ్ విద్యా వ్యవస్థను కొనసాగించాలని మహేష్ డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కి ఎయిడెడ్ పాఠశాల ఉందనే సమాచారం ఉందని వారు కూడా దీని వలన రాష్ట్రంలో పేద సామాన్య వర్గాల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అందువలన వారికి విద్యను దూరం చేసినటువంటి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకోవడం తగదనటువంటి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించకపోవడం దుర్మార్గమన్నారు. ఒక్క పశ్చిమ నియోజకవర్గం లోని సుమారు 12 వేల మంది పిల్లలు ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్నారని వారి గురించి కనీసం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలోచన చేయలేదని ఇకనుండి వారందరూ కూడా అందుబాటులో ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా లేనందున ప్రైవేటు స్కూళ్లలోనే ఫీజులు కట్టుకొని చదువుకోవాల్సినటువంటి దుర్భర పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com