
అనంతపురం, (జనస్వరం) : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయడంతో పొటు ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులు విలీనం పేరిట కాజేయాలని ఇచ్చిన జీవోను పూర్తిగా రద్దు చేయాలని ఆష్షన్ ల పేరిట మభ్య పెడితే మరో పోరాటానికి సన్నద్ధమవుతామని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామి రెడ్డి హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ. అనంతపురం జిల్లాలో ఉన్న ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఎస్ఎస్బిఎన్ విద్యార్థులు తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు, జనసేన నాయకులు ఉద్యమించడంతో గత్యంతరం లేక వెనక్కి తగ్గిందన్నారు. ఆప్షన్ల పేరిట మోసం చేయకుండా... ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనసేన ఆధ్వర్యంలో మరోపోరాటానికి పిలుస్తామని జయరాం రెడ్డి హెచ్చరించారు.