ఏలూరు, (జనస్వరం) : రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిపక్షాల గొంతును నొక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం1 ని తీసుకొచ్చిందని ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ చీకటి జీవో కి నిరసనగా శనివారం భోగిమంటలో జీవో నెం1 పత్రాలను తగులు పెట్టి జనసైనికులు నిరసన తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ కాలనీలో జనసేనపార్టీ నాయకులు వీరంకి పండు ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగి పండుగ అందరికీ భోగభాగ్యాలు అందించాలని భగవంతుని కోరుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టాలని ఇటువంటి చీకటి జీవోలను తీసుకువచ్చి ప్రజల హక్కులను హరించడం సరైన విధానం కాదని, రెడ్డిఅప్పలనాయుడు హెచ్చరించారు. అనంతరం జూట్ మిల్ ఫ్లై ఓవర్ కింద వామపక్ష నాయకులతో కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెం.1కు నిరశనగా ధర్నా కార్యక్రమం లోపాల్గొన్నారు.. ప్రజాస్వామ్యాన్ని ప్రజా గొంతుని ప్రజా స్వేచ్ఛను ప్రజల భావజాలాన్ని హరించేటట్టు దుర్మార్గమైన అటువంటి జీవో నెంబర్ 1 తీసుకువచ్చి, ప్రజలు ఎవరూ కూడా వారి యొక్క మనోభావాలను ప్రజలు వారి సమస్యలు గానీ ప్రజల స్వేచ్ఛను లేకుండా హరించేటటువంటి దుర్మార్గమైన జీవో నెంబర్ వన్ ని తక్షణమే రద్దు చేయాలని, జనసేన పార్టీ తరఫున అఖిలపక్ష ఆధ్వర్యంలో భోగి రోజున జీవో నెంబర్ 1 ని వేసి ధర్నా చేయడం జరిగిందన్నారు. వైయస్సార్ పార్టీకి సంబంధించినటువంటి 1961 లో ఈ జీవో ఉంది, అంటే తర్వాత వచ్చినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మీరు తీసి వేశారా ? ఇప్పటివరకు పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలకు పాదయాత్రలకు పోలీసులకు పర్మిషన్ ఇస్తున్నారని కొత్తగా జీఓ తీసుకురావాల్సిన పరిస్థితి అవసరం ఏముంది అని ప్రశ్నించారు. ప్రజలు రోడ్డు మీదకు రాకూడదు నడవకూడదు అనే మీరు ఎంతమంది మీ మీటింగ్ కి వచ్చారు ఎంతమంది మీ ఉద్యమానికి అనుమతినిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు పర్మిషన్ ఇస్తేనే మీటింగ్ పెట్టాలి మేం ఊ అంటే మీటింగ్ పెట్టాలి లేకపోతే మీరు రోడ్డు మీద తిరిగినటువంటి స్వేచ్ఛ లేదన్నటువంటి ఒక దొంగ జీవోని జీవో నెం.1 తీసుకువచ్చారన్నారు. దోపిడీదారులు తీసుకొచ్చినటువంటి జీవో నెం.1నీ జనసేనపార్టీ వామపక్షాలు ఖండిస్తున్నాయన్నారు. జీవో రద్దు చేసేంతవరకు ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు పాలుపంచుకొని ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు గుబ్బల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి నాయకులు రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, రాపర్తి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.