Logo
Date of Publish : 19 November 2022, 2:34 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

       విజయవాడ, (జనస్వరం) : ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని, దురాక్రమణను ధిక్కరించిన సామ్రాజ్ఞి, ఆశయ సాధనకు ఆయుధాన్ని చేపట్టి అలుపెరుగక పోరాడిన ధీశాలి, అనుబంధాలు నెలవైన మాతృమూర్తి ఝాన్సీ రాజ్య సారధి రాణీ లక్ష్మీ బాయి 194వ జయంతి వేడుకలను జనసేనపార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో వీర మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీర మహిళలు మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి మహిళలందరికీ ఆదర్శమని ఆమె స్ఫూర్తిని నింపుకొని ముందుకు సాగాలని, ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ అన్యాయాన్ని ఎదిరించాలని, వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయని, మహిళలకు రక్షణ కరువైందని ప్రభుత్వంలో మహిళలు అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని, మహిళా సాధికారత పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుందని, జనసేనపార్టీ వీర మహిళలకు పెద్దపీట వేస్తుందని, రాబోయే రోజుల్లో ఒక్కొక్క మహిళ ఒక లక్ష్మీ ఝాన్సీ బాయ్ అయ్యి వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చో పెడతారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు శ్రీదేవి, నగర ప్రధాన కార్యదర్శి ముబీనా, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమారి, పాల రజిని, అమ్మవారి ధార్మిక సేవ మండలి కమిటీ సభ్యులు రేవడి రమాదేవి, సుజాత, శిరీష, అక్తార్ ఉన్నిసా తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com