ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మండలం ఉద్ధాన ప్రాంతమైన తిప్పన పుట్టుగ గ్రామంలో రెండు కిడ్నీలు దెబ్బతిని సహాయం కోసం ఎదురుచూస్తున్న జేజమ్మ గారికి డయాలసిస్ ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ తరఫున 11000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ఇచ్ఛాపురం జనసేన పార్టీ నాయకుడు బొండాడ మహేష్ గారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాన్ గారి రాకతో కొంతవరకు కిడ్నీ బాధితులకు మేలు జరిగినా సరే ఈ వ్యాధిబారి పడుతున్న బాధితులు సంఖ్య తగ్గడం లేదన్నారు. సమూలంగా ఈ వ్యాధిని నిర్ములించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్ఛర్ల నియోజకవర్గ నాయకులు డా. విశ్వక్ షేన్, ఇచ్చాపురం నియోజకవర్గ నాయకులు దాసు, ప్రశాంత్, పృద్వి, జగదీశ్ జనసైనికులు శ్రీధర్, శన్ముఖ్, వెంకటేష్, నగేష్, కిరణ్, రవి, సుందర్,హరీష్, నేతాజీ, మరియు తిప్పన పుట్టుగా గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.
.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com