తాడిపత్రి ( జనస్వరం ) : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పెట్టుబడులకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సరైన ఆధారాలు లేకుండా అరెస్టయ్యి రిమాండ్ పైన ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనగా జనసేన పార్టీ మద్దతు తెలపడం జరిగింది. ఈ నిరసనల్లో భాగంగా తాడిపత్రి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జెసి ప్రభాకర్ రెడ్డి నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో జనసేన నాయకుల్ని కూడా పాల్గొనమని కోరారు. నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి రేపు మంగళగిరిలో జనసేన అధ్యక్షుల వారితో మీటింగ్ వున్నందున శుక్రవారం సాయంత్రం జెసి ప్రభాకర్ రెడ్డి గారిని వారి ఇంటి వద్ద కలిసి మద్దతు ఇవ్వడం జరిగింది. రేపటి దీక్షా కార్యక్రమంనకు మద్దతుగా నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, జనసైనికులు అందరూ పాల్గొంటారని తెలిపారు.