
అనంతపురం, (జనస్వరం) : అనంతపురం పట్టణంలో SSBN ఎయిడెడ్ స్కూల్ మరియు కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు యజమాన్యంను నిలదీయడం జరిగింది. అందుకు యజమాన్యం పోలీసు వారితో విద్యార్థులపై తీవ్రంగా దాడి చేయించి గాయపరచడం జరిగింది. విద్యార్థుల్ని పోలీసు వారు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సంఘటన తెలిసిన మరుక్షణమే అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి మరియు జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్లి, టూ టౌన్ పోలీస్ వారు పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించిన విద్యార్థులను విడిపించి, గాయాలు తగిలిన అమ్మాయిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కాలేజీ యాజమాన్యంతో చర్చించి, ఇంకొక మారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి విద్యార్థులందరికీ మనోధైర్యాన్ని నింపి మీకు జనసేన పార్టీ అండదండగా ఉంటుందని తెలపడం జరిగింది.